స్పీడ్‌ పెరిగింది.. ట్రైన్‌ జర్నీ తగ్గింది!

21 Aug, 2019 18:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ- ముంబై మధ్య ప్రయాణించే ప్రయాణికులు మునుపటి కంటే 5గంటలు ముందుగానే తమ గమ్య స్థానానికి చేరుకోవచ్చు. ఎందుకంటే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్లకు పెంచాలని భారత రైల్వే సంస్థ యోచిస్తోంది. వేగాన్ని పెంచడంతో ప్రస్తుతం 15.5 గంటలు ఉన్న ప్రయాణ సమయం 10 గంటలకు తగ్గుతుంది.

కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత, మిషన్‌ రఫ్తార్‌లో భాగంగా ముంబై- ఢిల్లీ మధ్యలో నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, దీంతో ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గుతుందని పశ్చిమ రైల్వే ఒక ట్వీట్‌లో పేర్కొంది. 

భారత రైల్వే సంస్థ తన 100 రోజుల కార్యాచరణలో భాగంగా, ఢిల్లీ- ముంబై, ఢిల్లీ- హౌరా మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించాలని ప్రతిపాదించింది. ఇందుకుగాను  ‘మిషన్ రఫ్తార్’ను 2016-17 రైల్వే బడ్జెట్‌లో మొదటగా ప్రకటించారు. సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయడం, రానున్న 5 సంవత్సరాలలో నాన్‌- సబర్బన్ ప్రయాణీకుల రైళ్ల సగటు వేగాన్ని 25 కిలోమీటర్ల మేర పెంచడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం.

'మిషన్ రఫ్తార్' కింద వేగం పెంచడానికి స్వర్ణ చతుర్భుజితోపాటు ఆరు ప్రధాన మార్గాలైన ఢిల్లీ- ముంబై, ఢిల్లీ- హౌరా, హౌరా- చెన్నై, చెన్నై- ముంబై, ఢిల్లీ-  చెన్నై, హౌరా- ముంబైలను లక్ష్యంగా చేసుకొంది. భారత రైల్వే సంస్ధ గుర్తించిన ఈ ఆరు మార్గాలలో 58 శాతం సరుకు రవాణా, 52 శాతం కోచింగ్ ట్రాఫిక్‌ను, 16 శాతం నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐఎన్‌ఎక్స్‌ కేసు : 20 గంటలుగా అజ్ఞాతంలో చిదంబరం

అండమాన్‌ నికోబార్‌లో భూకంపం

పియూష్‌ను కలిసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలు

చిదంబరానికి రాహుల్‌ మద్దతు

కశ్మీర్‌పై మరోసారి ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్‌

కుటుంబం మొత్తాన్ని హతమార్చాడు

ఆఫర్ల తగ్గింపు దిశగా జొమాటో

‘మాల్యా, నీరవ్‌ బాటలో చిదంబరం’

‘సాధ్వీ ప్రజ్ఞాసింగ్‌’ కేసు ఏమవుతుంది !?

ఇదేం న్యాయం: యడ్డీకిలేనిది మాకెందుకు?

నన్నే తిరిగి డబ్బులు అడుగుతావా?.. బెంగాల్‌లో దారుణం

చిదంబరం అరెస్ట్‌కు రంగం సిద్ధం!

గుండు చేయించుకుని.. భక్తితో నమస్కరిస్తూ

మోదీ సర్కారుపై ప్రియాంక ఫైర్‌

వ్యక్తి అత్యుత్సాహం, పులితో ఆటలు..దాంతో!

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం కన్నుమూత

బిగ్‌ పొలిటికల్‌ ట్విస్ట్‌: అమిత్‌ షా ప్రతీకారం!

‘ఆయన కళ్లు ఎలుకలు తినేశాయి’

ట్రంప్‌ అబద్ధాన్ని మోదీ నిజం చేశారు 

44 ఏళ్ల నాటి విమానం నడపాలా? 

నేను ఎవరి బిడ్డను?

మీరెవరు విడదీసేందుకు?

రాష్ట్రపతితో గవర్నర్‌ భేటీ

ఎట్టకేలకు యడియూరప్ప కేబినెట్‌

హింసాత్మక ఘటనపై చింతిస్తున్నా

చిదంబరం కస్టడీ అవసరమే

వడివడిగా మామ చుట్టూ..

ప్రకృతి విలయంగా వరదలు..

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

‘ప్రస్తుతం 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను’

ఆర్‌ఆర్‌ఆర్‌ : ఎన్టీఆర్‌కు జోడి కుదిరిందా.?

ఇండియాలో ఆయనే మెగాస్టార్‌

‘శివ’ గురించి బాధ పడుతున్నా..