ఆ దుర్మార్గుడికి జీవిత ఖైదు

2 Sep, 2017 08:10 IST|Sakshi
ఆ దుర్మార్గుడికి జీవిత ఖైదు

డెహ్రాడూన్‌: భార్యను అతిదారుణంగా హత్య చేసి  సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రాజేశ్  గులాటి(38) కు కోర్టు శిక్షను ఖరారు చేసింది.  ఈ కేసులో గులాటిని కోర్టు దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది. సుమారు ఏడేళ్ల క్రితం  సాఫ్ట్ వేర్ ఇంజనీర్, భార్య అనుపమను దారుణంగా హత్య  చేశాడు.

2010 అక్టోబర్ 17వ తేదీ రాత్రి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో ఈ దారుణ సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి  తన భార్య అనుపమ (36)తో  గొడవపడ్డాడు.  ఈ క్రమంలో  విచక్షణ కోల్పోయిన రాజేశ్, ఆమెను హత్య చేశాడు.

కాగా, 1999లో అనుపమను  ప్రేమ వివాహం చేసుకున్నాడు రాజేశ్. ఆ  తర్వాత ఇద్దరూ అమెరికా వెళ్లారు. 2008లో తిరిగి డెహ్రాడూన్ వచ్చారు. అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి వారి మధ్య గొడవలు జరిగాయి. ముఖ్యంగా కోల్ కతాకు చెందిన ఓ మహిళతో  రాజేశ్ కు వివాహేతన సంబంధం ఉందని  అనుపమ నిలదీస్తుండేది. ఈ నేపథ్యంలో తరచూవారి వారి మధ్య గొడవలు  జరిగేవి.  ఈ క్రమంలోనే  అనుపమను అతి దారుణంగా  హత్య చేసి 72 ముక్కలుగా చేశాడు.  వాటిని పాలథీన్ కవర్లలో ఉంచి డీప్ ఫ్రీజర్ లో ఉంచాడు. రోజుకో పాలథీన్‌ కవర్‌లో ఉంచి నగర శివార్లలోని వేర్వేరు ప్రాంతాల్లో పడేశాడు.  అయితే డిసెంబర్ 12, 2010 అనుపమ సోదరుడు ఎస్‌కెమహంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు ఈ హత్యోందంతం వెలుగు చూసింది.  పోలీసులు రాజేశ్ ఇంట్లో సోదాలు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో  నిందితుడు రాజేష్ గులాటీని పోలీసులు అరెస్టు చేయగా అప్పటినుంచి ఆయన జైలులో ఉన్నాడు.
 

మరిన్ని వార్తలు