తూత్తుకుడి మృతులకు రజనీ ఆర్థికసాయం

30 May, 2018 15:30 IST|Sakshi
మీడియాతో రజనీకాంత్‌

సాక్షి, చెన్నై: తూత్తుకుడి కాల్పుల మృతుల కుటుంబాలను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ బుధవారం పరామర్శించారు. కాల్పుల్లో చనిపోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడ్డవారికి పది వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం రజనీ మీడియాతో మాట్లాడుతూ.. తూత్తుకుడి ఘటన ప్రభుత్వానికి ఓ గుణపాఠం వంటిదన్నారు. ప్రభుత్వం జాగ‍్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమాయక ప్రజల పట్ల స్టెరిలైట్‌ పరిశ్రమ యాజమాన్యం అమానుషంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడం చాలా పెద్ద తప్పన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాల్పులకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. 

స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం 100వ రోజు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. దాదాపు 65 మంది గాయపడ్డారు.

మరిన్ని వార్తలు