నేటి నుంచి అభిమానులతో రజనీ భేటీ

26 Dec, 2017 02:55 IST|Sakshi

సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీ కాంత్‌ నేటి నుండి ఈ నెల 31 వరకూ తన అభిమానులతో భేటీ కానున్నారు. కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ అభిమానులతో రజనీ సమావేశమవుతారు. ఈ నెల 12న జరిగిన 68వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రజనీ రాజకీయ ఆరంగేట్రంపై ప్రకటన చేస్తారని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అయితే మంగళవారం నుంచి అభిమానులతో రజనీ సమావేశమవుతున్న నేపథ్యంలో ఆయన రాజకీయ ప్రవేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు