రజనీ రాజకీయం మొదలైంది!

30 May, 2018 09:14 IST|Sakshi

సాక్షి, చెన్నై: తూత్తుక్కుడి(ట్యూటీకోరిన్‌)లో స్టెరిలైట్‌ బాధితులను పరామర్శించాలని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నిర్ణయించుకున్నారు. అందుకోసం తన లేటెస్ట్‌ మూవీ ‘కాలా’ ప్రచారానికి తాత్కాలికంగా విరామం ఇచ్చారు రజనీ. తూత్తుక్కుడిలో స్టెరిలైట్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 13 మంది అమాయకులు పోలీసుల తూటాలకు బలైన విషయం తెలిసిందే. అయితే బాధితులను పరామర్శించేందుకు తాను తూత్తుక్కుడి వెళ్తున్నానని బుధవారం ఉదయం రజనీ వెల్లడించారు. అమాయకుల రక్తాన్ని చిందించే పోరాటాలు భవిష్యత్‌లో జరగకూడదన్నారు. 

బాధితుల పక్షాన నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రజనీ పేర్కొన్నారు. కానీ, బాధితులు కొందరు రజనీకాంత్‌ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తూత్తుకుడిలో పోలీసు కాల్పులపై మంగళవారం అసెంబ్లీలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఆ స్టెరిలైట్‌ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కాలా మూవీ ప్రమోషన్లలో భాగంగా షెడ్యూల్‌ చేసుకున్న హైదరాబాద్‌, ముంబై పర్యటనల్ని రద్దు చేసుకుని మరీ రజనీ తూత్తుక్కుడిలో పర్యటించనుండటం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాశంమైంది.

మరిన్ని వార్తలు