పోలీసు అవబోయి ఎమ్మెల్యేగా!!

17 Dec, 2018 05:40 IST|Sakshi

జైపూర్‌: రాజ్‌కుమార్‌ రోట్‌.. నిన్నటివరకు సాధారణ మధ్యతరగతి యువకుడు. పోలీసు రిక్రూట్‌మెంట్‌ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగి. మూడు నెలల క్రితం ఎన్నికల్లో పోటీ చేయమని ఓ పార్టీ అడిగితే సరే అన్నారు. అనూహ్య రీతిలో విజయం సాధించారు. పోలీసు కాబోయి ఎమ్మెల్యే అయ్యారు. త్వరలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న రాజ్‌కుమార్‌.. రాజస్తాన్‌ అసెంబ్లీలో గిరిజనుల ప్రతినిధిగా అడుగుపెట్టనున్నారు. దుంగార్పూర్‌లోని ఖూనియా గ్రామానికి చెందిన రాజ్‌కుమార్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. దీంతో ఛోరసీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాల్సిందిగా భారతీయ ట్రైబల్‌ పార్టీ (బీటీపీ) రాజ్‌కుమార్‌ను కోరింది. సరేనన్నారు. బీజేపీ అభ్యర్థి సుశీల్‌ కటారాపై 12,934 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు