‘జనాలతో మర్యాదగా మాట్లడలేరా?’

7 Nov, 2018 10:58 IST|Sakshi

న్యూఢిల్లీ : తమ సమస్యలు చెప్పుకోడానికి పోలీస్‌ స్టేషన్‌కి వచ్చే జనాలతో కాస్తా మర్యాదగా మాట్లాడుతూ వారికి ధైర్యం కలిగించలేరా అంటూ కేంద్ర హోం మినిష్టర్‌ రాజ్‌నాథ్‌ సింగ్‌ ఢిల్లీ పోలీసులను ప్రశ్నించారు. దివాళి సందర్భంగా రాజధానిలో పెట్రోలింగ్‌ విధుల నిర్వహించే పోలీస్‌ అధికారులకు మోటర్‌ సైకిల్లను అందించారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ మాట్లాడుతూ ఢిల్లీ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలవాలని కోరారు.

‘ఎవరో ఒక బాధితుడు లేది బాధితురాలు తమ సమస్య గురించి చెప్పడానికి పోలీస్‌ స్టేషన్‌కి వస్తారు. అలాంటి వారితో కాస్తా మంచిగా, మర్యాదగా మాట్లాడలేమా..? వారికి కొన్ని మంచి నీళ్లు ఇ‍వ్వలేమా అంటూ ఆయన ప్రశ్నించారు. పోలీసులు ప్రజలతో స్నేహంగా ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు నాంది పలకాల్సిందిగా కోరారు. అంతేకాక ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఒక టీ కొట్టును ఏర్పాటు చేయాల్సిందిగా నగర పోలీస్‌ కమిషనర్‌ను ఆదేశించారు. అందుకు కావాల్సిన నిధులను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని తెలిపారు.

పోలీస్‌లు ప్రజలకు రోల్‌ మోడల్‌గా ఎందుకు ఉండకూడదంటూ ఆయన ప్రశ్నించారు. పోలీస్‌ స్టేషన్‌కి వచ్చే సాధరణ ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని కోరారు. ఇకమీదట ప్రతి పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించిన వివరాలను తెప్పించుకుంటాను.. ఏవైనా మార్పులు వచ్చాయా లేదా అనేది పరిశీలిస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు