ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన రాజ్‌నాథ్‌

11 Oct, 2019 09:06 IST|Sakshi

న్యూఢిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానం స్వీకరించిన అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ దానికి ఆయుధ పూజ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే రాజ్‌నాథ్‌ చర్యల పట్ల ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రతిపక్షాల విమర్శలపై స్పందించారు రాజ్‌నాథ్‌ సింగ్‌. ‘జనాలు తమకు నచ్చినట్లు మాట్లాడతారు. నేను చేసే పని సరైంది అని నాకు అనిపించినప్పుడు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ పనిని నేను కొనసాగిస్తాను. ఓ గొప్ప అతీతశక్తి ఉందని చిన్నతనం నుంచి నేను నమ్ముతాను. నాతో పాటు దేశంలో చాలా మంది దీన్ని విశ్వసిస్తారు. మన దేశంలో వాహనాలు, ఆయుధాలు కొన్న తర్వాత పూజ నిర్వహించడం.. దానిపై ఓంకారాన్ని రాయడం పరిపాటి. ఇది మన ఆచారం. అదే నేను చేశాను. నచ్చిన దైవాన్ని ప్రార్థించే హక్కు రాజ్యాంగమే మనకు కల్పించింది. ఈ విషయంలో ఎవరి విమర్శలు పట్టించుకోను’ అని స్పష్టం చేశారు.

భారత్‌, ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ యుద్ధ విమనాలు కొనుగోలు చేస్తోన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2021నాటికి ఫ్రాన్స్‌ 18 రఫేల్‌ యుద్ధ విమానాలను భారతకు అందజేస్తుంది. మే 2022 నాటికి దేశం మొత్తం మీద 36 రఫేల్‌ జెట్లు ఉండబోతున్నాయి.
(చదవండి: ‘ఏ దేశంపై దాడి చేసే ఉద్దేశం లేదు’)

మరిన్ని వార్తలు