యుద్ధ విమానం తేజాస్‌లో రాజ్‌నాథ్‌

19 Sep, 2019 10:50 IST|Sakshi

బెంగళూర్‌ : యుద్ధ విమానం తేజాస్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం ప్రయాణించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో పైలట్‌ వెనుక సీటులో కూర్చున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ హెల్మెట్‌ ధరించి, ఆక్సిజన్‌ మాస్క్‌తో ప్రయాణానికి సిద్ధం కాగా బెంగళూర్‌లోని హాల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానం టేకాఫ్‌ తీసుకుంది. అంతకుముందు యుద్ధ విమానం తేజాస్‌లో ప్రయాణానికి సర్వ సన్నద్ధంగా  ఉన్నానని రాజ్‌నాథ్‌ సింగ్‌ నేవీ యూనిఫాంలో రెండు ఫోటోలను పోస్ట్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. తేజాస్‌ యుద్ధ విమానంలో పర్యటించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్‌ పేరిట రికార్డ్‌ నమోదైంది.పూర్తి దేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో విహారం ఆస్వాదించానని, తేలికపాటి యుద్ధ విమానం తేజాస్‌ కొనుగోలుకు ఆగ్నేయాసియా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. పైలట్‌ సూచనతో తాను కొద్దిసేపు విమానాన్ని నియంత్రించానని ఈ అనుభవం తనను థ్రిల్‌కు గురిచేసిందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు.కాగా ఈ ఏడాది జనవరిలో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ సుఖోయ్‌ 30 యుద్ధ విమానంలో జోథ్‌పూర్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేఫన్‌ సుంచి 45 నిమిషాల పాటు ప్రయాణించారు.

మరిన్ని వార్తలు