కశ్మీర్ పరిస్థితిపై రాజ్ నాథ్ సమీక్ష

19 Aug, 2016 11:06 IST|Sakshi
కశ్మీర్ పరిస్థితిపై రాజ్ నాథ్ సమీక్ష

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్  కశ్మీర్ లో గత కొంత కాలంగా నెలకొన్న పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.   రక్షణమంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ గంటకు పైగా చర్చించారు. మంత్రులకు అధికారలు కశ్మీర్ పరిస్థితులపై  నివేదికను  సమర్పించారు.

గతేడాది నవంబర్ నెలలో  కశ్మీరుకు కేటాయించిన రూ.80 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని అమలుపై సమావేశంలో చర్చించారు. ముజాహిదీన్ కమాండర్, యువ వేర్పాటువాద నేత బుర్హాన్ వాని జులై 8న భద్రతాదళాల ఎన్‌కౌంటర్లో చనిపోయిననాటి నుంచి ప్రారంభమైన ఉద్రిక్తత 40 రోజులు దాటింది. ఇప్పటి వరకు జరిగిన  అల్లర్లలో 64 మంది మరణించారు. వేల మంది గాయపడ్డారు.
 

మరిన్ని వార్తలు