‘వారి విడుదల కోసం ప్రార్థిస్తున్నా’

23 Feb, 2020 10:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నిర్బంధంలో ఉన్న ముగ్గురు జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎంలు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీల విడుదల కోసం ప్రార్ధిస్తున్నానని, కశ్మీర్‌లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు వారు సహకరిస్తారని ఆశిస్తున్నానని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్ట్‌ 5న జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను అందించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో మాజీ సీఎంలు సహా పలువురు రాజకీయ నేతలను కశ్మీర్‌ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

అప్పటినుంచి పలువురు నేతలను విడుదల చేసినా ముగ్గురు మాజీ సీఎంలు మాత్రం నిర్బంధంలో కొనసాగతున్నారు. ఫరూక్‌ అబ్దుల్లాను అత్యంత కఠినతర ప్రజాభద్రత చట్టం (పీఎస్‌ఏ) కింద అరెస్ట్‌ చేయగా ఒమర్‌, మెహబూబాలను అదే చట్టం కింద నిర్బంధంలో ఉంచారు. ఇక కశ్మీర్‌లో పరిస్ధితి ప్రశాంతంగా ఉందని, పరిస్థితి వేగంగా మెరుగవుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చెప్పుకొస్తూ వీరి (నిర్బంధంలో ఉన్న రాజకీయనేతల విడుదల) పై కూడా ఓ నిర్ణయం ఖరారు చేయాల్సి ఉందని, ప్రభుత్వం ఏ ఒక్కరినీ వేధించదని స్పష్టం చేశారు. కశ్మీర్‌ పురోగతి కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని అన్నారు.

చదవండి : మనది మతరాజ్యం కాదు

మరిన్ని వార్తలు