ఈ సమావేశాల్లోనే ఆ బిల్లును చేపడతాం : రాజ్‌నాథ్‌

2 Aug, 2018 13:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే ఎస్‌సీ, ఎస్‌టీ బిల్లును ప్రవేశపెడతామని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం వెల్లడించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అత్యాచారాల నిరోధక చట్టం తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసిందని, ఈ చట్టం నిర్వీర్యమయ్యేందుకు ప్రభుత్వం అనుమతించబోదని ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే స్పష్టం​చేశారని చెప్పారు.

ఎస్‌సీ,ఎస్‌టీ చట్టాన్ని నీరుగార్చేలా సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటివరకూఎలాంటి చర్యలూ చేపట్టలేదన్న కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శలు గుప్పించిన క్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ ఈ మేరకు పేర్కొన్నారు. మరోవైపు ఎస్‌సీ, ఎస్‌టీ బిల్లును ప్రవేశపెట్టేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది. పార్టీ సభ్యులంతా నేడు, రేపు సభలోనే ఉండాలని కోరుతూ బీజేపీ తమ లోక్‌సభ ఎంపీలందరికీ విప్‌ జారీ చేసింది.

మరిన్ని వార్తలు