హిందీని మాపై రుద్దొద్దు

19 Sep, 2019 05:23 IST|Sakshi

చెన్నై: దేశమంతటా ఒకే భాష అమలు సాధ్యం కాదని సీనియర్‌ నటుడు రజనీకాంత్‌ అన్నారు. ఈ నిర్ణయాన్ని కేవలం దక్షిణాది రాష్ట్రాలే కాదని, ఉత్తరాది రాష్ట్రాలు కూడా తిరస్కరిస్తాయని బుధవారం మీడియాతో అన్నారు. దేశమంతటా హిందీ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హిందీ దివస్‌ నాడు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రజనీకాంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏ దేశ అభివృద్ధికైనా, ఏకత్వానికైనా ఒకే భాష అవసరమని అయితే అది ఏ ఒక్కరో తీసుకురాలేరని అన్నారు. అందుకే హిందీని దేశమంతటా అమలు చేయలేమన్నారు. అమిత్‌షా వ్యాఖ్యలకు వ్యతిరేకంగా డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి యెడియూరప్ప, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యలు కూడా గళమెత్తిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు