కొత్తగా ముస్తాబవుతున్నరాజ్యసభ

24 Apr, 2015 14:17 IST|Sakshi
కొత్తగా ముస్తాబవుతున్నరాజ్యసభ

ఎప్పుడో.. 88 ఏళ్ల నాటి పురాతనమైన  పార్లమెంటు భవనంలోని రాజ్యసభ సమావేశ హాలుకు ఇపుడు  కొత్త హంగులు, సొబగులు అమరుతున్నాయి. రాజ్యసభ భవనంలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిన  తమ ప్రభుత్వం చారిత్రక కట్టడ నిర్మాణ  సౌందర్యం చెడిపోకుండా జాగ్రత్తలు  తీసుకున్నామని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ శుక్రవారం రాజ్యసభలో ప్రకటించారు. రాజ్యసభకు హంగులద్దే కార్యక్రమం  దాదాపు  పూర్తయిందని ఆయన తెలిపారు. భవనం డోమ్కు కొత్త అందాలు అద్దుతున్నామన్నారు. 

ఈ సందర్భంగా రాజ్యసభ అధ్యక్షుడు, హమీద్ అన్సారీ, ఉపాధ్యక్షుడు కురియన్  తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.  భవనంలో రెడ్ కార్పెట్స్ను  పూర్తిగా  మార్చామని తెలిపారు.  వాటిని ఆఖరిసారి ఎవరు ఎపుడు మార్చారో తెలియదు కానీ... కార్పెట్స్ సహా, కుర్చీలు కూడా  కొత్తవి ఏర్పాటు చేశామని రాజ్యసభలో ప్రకటించారు.  ప్రతిపక్ష నేతలు కూడా ఈ మార్పును గమనించలేకపోయారని నక్వీ తెలిపారు.

దీనికి  స్పందించిన కురియన్ సభ భవన సహజత్వం  కోల్పోకుండా మార్పులు  చాలా బాగా జరిగాయని  ప్రశంసించారు. కాగా 2012 మేలో  సభలో దుర్వాసన రాడంతో సభ్యులు గ్యాస్ దాడి అని, వంట గ్యాస్ లీకయ్యిందని ఆందోళనకు గురయ్యారు. తర్వాత రెండు రోజులు పాటు సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజ్యసభ  తీర్చిదిద్దే పనులు శ్రీకారం చుట్టింది ఎన్డీయే ప్రభుత్వం.

>
మరిన్ని వార్తలు