ముఖ్యమంత్రిపై టాప్‌ లాయర్‌ ఫైర్‌

30 Jul, 2017 09:36 IST|Sakshi
ముఖ్యమంత్రిపై టాప్‌ లాయర్‌ ఫైర్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు, ఆయన మాజీ లాయర్‌ రాంజెఠ్మలానీకి  మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తనపై పరువు నష్టం కేసు దాఖలైన తరువాత కేజ్రీవాల్‌ కేంద్ర అరుణ్‌జైట్లీపై ఎన్నో పరుష పదాలు వాడారని రాంజెఠ్మలానీ ఆరోపించారు. ఈమేరకు జూలై 20న కేజ్రీకి రాసిన లేఖను తన బ్లాగ్‌లో పోస్ట్‌ చేశారు. కేసు విచారణ సందర్భంగా జైట్లీపై అసభ్యకర పదాలు వాడమని రామ్‌జెఠ్మలానికి సూచించలేదని కేజ్రీవాల్‌ పేర్కొనడంతో ఇద్దరి మధ్య విభేదాలు వెలుగుచూశాయి.

‘జైట్లీ తొలిసారి పరువు నష్టం కేసు వేశాక నా సేవలు వాడుకోవాలనుకున్నారు. జైట్లీపై ‘క్రూక్‌’(మోసగాడు)ని మించిన పరుష పదాలు ఎన్ని వాడారో మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. ఆ క్రూక్‌కు గుణపాఠం చెప్పాలని వందసార్లు అడిగార’ని జెఠ్మలానీ లేఖలో తెలిపారు. ఈ లేఖ ప్రతిని అరుణ్‌ జైట్లీకి కూడా పంపించడం గమనార్హం. పరువునష్టం కేసులో వాదించినందుకు లీగల్‌ ఫీజు కింద తనకు రూ. రెండు కోట్లు ఇవ్వాలని ఇంతకుముందు కేజ్రీవాల్‌ను జెఠ్మలానీ డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ తరపున వాదించబోనంటూ ఈ నెల 20న జెఠ్మలానీ ప్రకటించారు.

మరిన్ని వార్తలు