ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ కన్నుమూత 

8 Sep, 2019 09:29 IST|Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రామ్‌ జెఠ్మలానీ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. జెఠ్మలానీ 1923 సెప్టెంబర్‌ 14న సింధు ప్రావినెన్స్‌లోని సిఖర్‌పూర్‌లో జన్మించారు. న్యాయవాద వృత్తిలో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. చరిత్రలో లిఖించదగ్గ పలు కేసులను ఆయన వాదించారు. రాజీవ్‌ గాంధీ హత్య కేసు, హర్షద్‌ మెహతా స్టాక్‌ మార్కెట్‌ వంటి పలు కేసులను ఆయన వాదించారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా సేవలందించారు. జఠ్మాలనీ మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.ఇక  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా... జెఠ్మాలనీ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. 


 జెఠ్మాలనీ మృతిపట్ల ఏపీ సీఎం జగన్‌ సంతాపం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా రామ్‌ జెఠ్మాలనీ మృతిపట్ల సంతాపం తెలిపారు. జెఠ్మాలనీ కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామ్‌ జెఠ్మాలనీ గొప్ప న్యాయశాస్త్ర నిపుణులని, ఆయన సుదీర్ఘ ప్రస్తానంలో పలు కీలకమైన కేసులు వాదించారని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ గుర్తు చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు