ఎగ్జిట్‌ పోల్స్‌ అలా అయితే ఓకే..

20 May, 2019 19:24 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే భారీ ఆధిక్యం సాధిస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తోసిపుచ్చిన విపక్షాలపై బీజేపీ మండిపడింది. ఇవే ఎగ్జిట్‌ పోల్స్‌ విపక్షాలకు అనుకూలంగా వస్తే వాటిని  సమర్ధించేవని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభానికి ముందు తాము చెప్పిన స్ధానాలకు అనుగణంగా ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చాయని చెప్పారు.

2014 లోక్‌సభ ఎన్నికల కంటే తమకు ఎక్కువ సీట్లు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ను మమతా బెనర్జీ, కుమార స్వామి, చంద్రబాబునాయుడు వంటి విపక్ష నేతలు ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ వారి అంచనాలకు తగినట్టు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వస్తే అవి సరైనవేనని, లేకుంటే వాటిని తప్పుపడతారని వ్యాఖ్యానించారు. వారంతా ఈవీఎంల ద్వారానే గతంలో గెలిచినా ఇప్పుడు వాటి పనితీరును ప్రశ్నిస్తున్నారని ఆక్షేపించారు. విపక్ష నేతలకు ఈనెల 23న భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. తమ పార్టీకి 300 స్ధానాల వరకూ దక్కుతాయని రాంమాధవ్‌ ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు