సమసమాజమే రామానుజుల లక్ష్యం

17 Sep, 2017 02:42 IST|Sakshi
సమసమాజమే రామానుజుల లక్ష్యం
- అందుకోసం వెయ్యేళ్ల క్రితమే జీవితాంతం కృషి
- కొనియాడిన త్రిదండి చినజీయర్‌ స్వామి
 
సాక్షి, న్యూఢిల్లీ: అసమానతల్లేని సమాజమే లక్ష్యంగా వెయ్యేళ్ల క్రితమే శ్రీ రామానుజా చార్యులు జీవితాంతం కృషి చేశారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి కొనియాడారు. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌ శంషాబాద్‌ సమీపంలోని తన ఆశ్రమమైన ‘జీవ’లో ప్రతిష్టించనున్న 216 అడుగుల రామానుజుల పంచలోహ విగ్రహ (సమతా విగ్రహం) ఏర్పాట్ల వివరా లను చినజీయర్‌స్వామి శనివారం ఢిల్లీలో విలే కరులకు వెల్లడించారు. సుమారు రూ. 1,000 కోట్ల వ్యయంతో వంద ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టించనున్న రామానుజుల విగ్రహ ఏర్పా ట్లు నవంబర్‌ నాటికి పూర్తవుతాయన్నారు.

సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా వచ్చే ఏడాది మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 21 వరకు 27 రోజుల పాటు ఆశ్రమంలో వివిధ కార్యక్రమాలు నిర్వ హిస్తున్నామన్నారు. ఈ సందర్భంగానే రామా నుజుల విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్లను మూడు దశల్లో చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ కూడా హాజరు కానున్నట్టు చెప్పారు. రామానుజాచార్యుల జీవితాన్ని వివరిస్తూ మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక ఆడిటోరియం నిర్మిస్తున్నట్లు తెలిపారు. సమసమాజ స్థాపన తోపాటు సమస్త మానవాళికి వేదాల అవస రాన్ని చాటేందుకు రామానుజులు జీవితాం తం పాటుపడిన విధానాన్ని వర్చువల్‌ చిత్రాల ద్వారా నేటి తరానికి తెలియజేస్తామన్నారు.
 
రామానుజుల జీవిత విశేషాలపై షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌...
రామానుజుల జీవిత ఇతివృత్తం, ఆయన అనుసరించిన ఆదర్శాల వల్ల సమాజంలో చోటుచేసుకున్న పరిణామాలను వివరించేలా అంతర్జాతీయ లఘు చిత్ర ఉత్సవాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు హైదరా బాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో నిర్వహించనున్నట్లు చినజీయర్‌స్వామి తెలిపారు. ఇందులో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేసి మొదటి బహు మతికి రూ. 10 లక్షలు, రెండో బహుమతికి రూ. 8 లక్షలు, మూడో బహుమతికి రూ. 6 లక్షలు ఇస్తామన్నారు. బహుమతుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 4న తమ ఆశ్రమంలో జరుగు తుందన్నారు. లఘు చిత్రాల చిత్రీకరణలో వైష్ణవ తెంకలి సంప్రదాయాన్ని పాటించాలని కోరారు. లఘు చిత్రాలను ఏ భాషలో అయినా చిత్రీకరించవచ్చని, అయితే అందులో ఆంగ్లం లో సబ్‌ టైటిల్స్‌ ఉండేలా చూడాలని, చిత్రం నిడివి 8 నిమిషాలకు మించకుండా ఉండాల న్నారు. సంబంధిత వివరాలు సేవ్‌టెంపుల్‌. ఓఆర్‌జీలో ఉంటాయన్నారు. సమావేశంలో మై హోం గ్రూప్‌ చైర్మన్‌ జూపల్లి రామేశ్వరరావు, గజల్‌ శ్రీనివాస్, జీఎంఆర్‌ గ్రూప్‌ బిజినెస్‌ చైర్మన్‌ బీవీఎన్‌ రావు పాల్గొన్నారు.
 
ప్రధాని గుర్తించడం అభినందనీయం..
సమానత్వం కోసం రామాను జులు చేసిన కృషిని ప్రధాని మోదీ గుర్తించి ఆచరించడం అభినందనీ యమని చిన్నజీయర్‌స్వామి పేర్కొన్నా రు. మోక్షానికి సంబంధించిన గురు మంత్రాన్ని సర్వజనుల హితం కోసం రామానుజులు బహిర్గతం చేశారని మే 1న రామానుజుల తపాలాబిళ్ల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాని పేర్కొనడం సంతోషకరమన్నారు. దేశ స్వాతంత్య్రం అనంతరం రామానుజుల కృషిని గుర్తించిన ఏకైక ప్రధాని మోదీయేనన్నారు.
మరిన్ని వార్తలు