'కరోనిల్‌' 80 శాతం సక్సెస్‌ను చూపించింది

23 Jun, 2020 12:20 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ను  తయారు చేయడానికి ప్రపంచ దేశాలన్నీ అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే 13 రకాల వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగించారు.  మరో 120 కి పైగా సంస్థలు ఈ మందు తయారీలో నిమగ్నమయ్యాయి. తాజాగా యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేద సంస్థ కరోనా నివారణకు 'కరోనిల్‌' అనే ఆయుర్వేద ఔషదాన్ని కనుగొన్నట్లు ప్రకటించింది.

ఈ మేరకు పతంజలి యోగ్‌పీఠ్‌‌ సహవ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు. పతంజలి సంస్థ తయారుచేసిన ఔషదం 80 శాతం సక్సెస్‌ను చూపించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం మధ్యాహ్నం హరిద్వార్‌లోని పతంజలి యోగ్‌పీఠ్‌‌లో ఏర్పాటు చేసే మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు బాలకృష్ణ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొన్నారు. చదవండి: 'కరోనా నివారణకు ప్రత్యేక వ్యాక్సిన్'

మరిన్ని వార్తలు