బాబా రాందేవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

4 Nov, 2018 15:51 IST|Sakshi

హరిద్వార్‌ : జనాభా నియంత్రణపై నిత్యం మాట్లాడే బ్రహ్మచారి. యోగా గురు బాబా రాందేవ్‌ ప్రభుత్వానికి మరో సూచన చేశారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్న దంపతుల ఓటు హక్కు రద్దు చేయాలని రాందేవ్‌ పేర్కొన్నారు. ఈ దేశంలో పెళ్లి చేసుకోని తనలాంటి సన్యాసులను గౌరవించాలని, పెళ్లి చేసుకుని ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లల్ని కనే జంటల ఓటింగ్‌ హక్కులను రద్దు చేయడం మేలని సూచించారు.

ఆదివారం హరిద్వార్‌లోని తన ఆశ్రమంలో సహచరులను ఉద్దేశించి బాబా రాందేవ్ ఈ వాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాల్లో పది మంది సంతానాన్ని కనేందుకు సైతం మన వేదాలు అనుమతించాయని, ఇప్పటికే దేశ జనాభా 125 కోట్లు దాటిన క్రమంలో ప్రస్తుతం అధిక సంతానం మనకు అవసరం లేదన్నారు. భార్యా పిల్లలు లేకుండా తాము ఎంత సుఖంగా ఉంటామో చూడాలని రాందేవ్‌ చమత్కరించారు.
 

మరిన్ని వార్తలు