దీపికకు రామ్‌దేవ్‌ బాబా చురకలు

14 Jan, 2020 09:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : జేఎన్‌యూ విద్యార్థులకు సంఘీభావంగా యూనివర్సిటీకి వెళ్లినందుకు గాను బాలీవుడ్‌ అగ్రతార దీపికా పదుకొనే సోషల్‌ మీడియాలో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దేశ ద్రోహులకు ఆమె బాసటగా నిలిచారని అనేకమంది, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెను నిందించారు. తాజాగా వారి జాబితాలో ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్‌ బాబా కూడా చేరారు. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ ప్రసంగిస్తూ.. దీపికకు చురకులు అంటించారు. ‘ఏదైన విషయంపై స్పందించే ముందు దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులు గురించి తెలుసుకుని ఉండాలి. వాటిపై కనీస అవగాహన పెంచుకోవాలి. తెలియపోతే మంచి సలహాదారుడిని నియమించుకుని, తెలుసుకునే ప్రయత్నం చేయాలి’ అంటూ దీపికకు సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రెండు కోట్లకు పైగా వలసవాదులు అక్రమంగా నివశిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏఏ,  ఎన్‌ఆర్‌సీ అమలు ద్వారా, అక్రమ వలసలను అరికట్టే అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.  సొంత ప్రయోజనాల కోసం కొందరు ఆందోళనకు దిగుతున్నారని మండిపడ్డారు. జామియా విద్యార్థులు ఇప్పటికీ జిన్హా వాలా జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ చట్టాలను తప్పుబడుతూ.. ప్రతిపకక్షాలు చేసే ఆందోళనలను ఆయన తిప్పికొట్టారు. ఇది దేశ ఐక్యతను మంచిదికాదన్నారు. 

>
మరిన్ని వార్తలు