తిలక్‌ మునిమనవడిపై రేప్‌ కేసు

19 Jul, 2017 02:16 IST|Sakshi
తిలక్‌ మునిమనవడిపై రేప్‌ కేసు

పుణె: స్వాతంత్య్ర సమరయోధుడు బాలగంగాధర తిలక్‌ మునిమనవడు, కాంగ్రెస్‌ నేత రోహిత్‌ తిలక్‌పై సోమవారం రాత్రి రేప్‌ కేసు నమోదైంది. రోహిత్‌ దివంగత ఎంపీ జయంత్‌రావు మనవడు. నలభై ఏళ్ల మహిళతో ఆయనకు కొంతకాలంగా పరిచయం ఉంది.

అయితే, వివాహం చేసుకుంటానని నమ్మిస్తూ కొంతకాలంగా తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, అసహజ రీతిలో లైంగిక వాంఛ తీర్చాలని బలవంతం చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రోహిత్‌పై పోలీసులు రేప్‌ కేసు నమోదు చేశారు. రోహిత్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో పుణెలోని కస్బాపేట్‌ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయారు.  

మరిన్ని వార్తలు