అరుదైన బ్లాక్‌ పాంథర్‌ కనిపించింది!!

22 May, 2018 11:21 IST|Sakshi

భువనేశ్వర్ ‌: ఒడిశాలోని సుందర్‌గఢ్‌ అడవిలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. ఎన్నడూలేనిది తొలిసారి ఈ అడవీప్రాంతంలో నల్లచిరుత (బ్లాక్‌ పాంథర్‌) కనిపించింది. అడవిలో నల్లచిరుత సంచరిస్తుండగా కెమెరాలో రికార్డు అయిందని సుందర్‌గఢ్‌ ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ హెచ్‌కే బిస్త్‌ తెలిపారు.

సుందర్‌గఢ్‌ ఫారెస్ట్‌ డివిజన్‌లోని గర్జన్‌పహడ్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఏర్పాటుచేసిన కెమెరాల్లో నల్లచిరుత తిరుగుతున్న దృశ్యాలు నమోదయ్యాయని ఒడిశా అటవీశాఖ ప్రధానాధికారి సదీప్‌ త్రిపాఠీ తెలిపారు.

నల్లచిరుత కనిపించిన తొమ్మిది రాష్ట్రం ఒడిశా. మెలనిస్టిక్‌ లియోపార్డ్స్‌గా పిలిచే ఈ బ్లాక్‌ పాంథర్స్‌ ఇప్పటివరకు కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని అడవుల్లో కనిపించాయి.

22 ఏళ్ల కిందట ఒడిశాలోని ఫూల్‌బనీ, సిమ్లీపాల్‌ అడవుల్లో నల్లచిరుతలు కనిపించినట్టు చెప్తారు. అయితే, అప్పుడు కెమెరాలు అందుబాటులో లేకపోవడంతో వీటి ఉనికి నిర్ధారించలేదు. జంతువుల సంచారాన్ని, సమాచారాన్ని సేకరించేందుకు 2015లో అడవిలో కెమెరాలు ఏర్పాటుచేశారు. పరిశోధకులు అందుబాటులో లేని సమయంలోనూ దూరం నుంచి ఆపరేట్‌ చేస్తూ.. జంతువుల సంచారాన్ని నమోదుచేసేందుకు వీలుగా ఈ కెమెరాలు ఏర్పాటుచేశారు.

మరిన్ని వార్తలు