రెండేళ్ల తర్వాత మళ్లీ నల్ల పులి దర్శనం

2 Jan, 2020 20:21 IST|Sakshi

ముంబై : దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా అభయారణ్యంలో నల్ల చిరుత సంచారం పర్యాటకులను కనువిందు చేసింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని తడోబా అభయారణ్యాన్ని సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులకు నల్ల చిరుత కనిపించడంతో పర్యాటకులు తమ చరవాణిలో చిరుతను బందించేందుకు పోటీపడ్డారు. ఇక్కడ వివిధ రకాల జంతువులు, మృగాలు ఉన్నప్పటికీ.. అత్యంత అరుదుగా కనిపించే నల్ల చిరుత సంచారం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు సంవత్సరాల క్రితం తడోబా అభయారణ్యంలో కనిపించిన నల్ల చిరుత.. ఇవాళ మళ్లీ తడోబా అభయారణ్యంలో దర్శనమిచ్చింది.

మరిన్ని వార్తలు