నోబెల్ బహుమతి ఇస్తానంటే.. వద్దన్నాను!

3 May, 2016 15:17 IST|Sakshi
నోబెల్ బహుమతి ఇస్తానంటే.. వద్దన్నాను!

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ఓ చిత్రమైన విషయం చెప్పారు. తనకు గతంలో నోబెల్ శాంతి బహుమతి ఇస్తామంటే.. వద్దని తిరస్కరించానన్నారు. ఇటీవల పాకిస్థానీ అమ్మాయి మలాలా యూసుఫ్‌జాయ్‌కి ఈ అవార్డు ఇవ్వడం కూడా సరికాదని, ఆమెకు ఆ అర్హత లేదని చెప్పారు. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సినంతగా ఆమె ఏమీ చేయలేదని ఆయన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

తాను కేవలం పని చేయడాన్నే నమ్ముతాను తప్ప.. తనకు అవార్డులతో పనిలేదని చెప్పారు. అవార్డులు ఇచ్చేటప్పుడు దానికి తగిన అర్హత ఉందో లేదో చూసుకోవాలని, మలాలాకు ఆ అవార్డు ఇవ్వడం శుద్ధ దండగని అన్నారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి వెళ్లినప్పుడు ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవలే భారత ప్రభుత్వం ఆయనను పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ఆ అవార్డు స్వీకరించారు.

మరిన్ని వార్తలు