ఉత్తరాఖండ్‌ సీఎంగా రావత్‌

18 Mar, 2017 04:41 IST|Sakshi
ఉత్తరాఖండ్‌ సీఎంగా రావత్‌

నేడు డెహ్రాడూన్‌లో ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ/డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ఆరెస్సెస్‌ కార్యకర్త, మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు త్రివేంద్ర సింగ్‌ రావత్‌ను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. జార్ఖండ్‌ బీజేపీ ఇంచార్జిగా ఉన్న రావత్‌.. పార్టీ చీఫ్‌ అమిత్‌ షా, ప్రధాని నరేంద్ర మోదీలకు అత్యంత సన్నిహితుడు. మోదీ ఉత్తరాఖండ్‌ బీజేపీ ఇంచార్జీగా ఉన్నప్పటినుంచీ రావత్‌కు సత్సంబంధాలున్నాయి. దీనికి తోడు జార్ఖండ్‌లో పార్టీని అధికారంలోకి తీసుకురావటంలో క్రియాశీలకంగా వ్యవహరించారని రావత్‌కు పార్టీలో మంచి పేరుంది.

శుక్రవారం డెహ్రాడూన్‌లో సమావేశమైన ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యేలు.. పార్టీ కేంద్ర పరిశీలకులు సరోజ్‌ పాండే, నరేంద్ర తోమర్‌ల సమక్షంలో  రావత్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు. శనివారం త్రివేంద్ర  ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని పార్టీ ఉత్తరాఖండ్‌ అధ్యక్షుడు అజయ్‌ భట్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు