ఆర్బీఐ పాత్ర నామమాత్రమేనా?: అమర్త్యసేన్‌

11 Jan, 2017 03:56 IST|Sakshi

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) స్వతంత్రతపై నోబెల్‌ బహుమతి గ్రహీత, ఆర్థిక వేత్త అమర్త్యసేన్‌ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆర్బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతోందని.. ప్రధాని తీసుకున్న నిర్ణయాలు అమలుచేసేందుకే పరిమితమైందని ఓ ఇంటర్వూ్యలో అన్నారు. నోట్లరద్దు వల్ల నల్లధనాన్ని నిర్మూలించాలనే ప్రక్రియలో ప్రధాని దారుణంగా విఫలమయ్యారన్నారు. ‘నోట్లరద్దు నిర్ణయం ఆర్బీఐది కాదని అర్థమవుతోంది. ఇది కేవలం ప్రధాని ఆలోచనే’ అని విమర్శించారు. దేశంలో దొంగనోట్లు పెద్ద సమస్యే కాదని.. రఘురామ్‌ రాజన్‌ ఉన్నంతకాలం ఆర్బీఐ స్వతంత్రంగా వ్యవహరించిందని అమర్త్యసేన్‌ తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు