మొటిమలు బాధిస్తున్నాయా...?

11 Apr, 2018 11:52 IST|Sakshi

న్యూఢిల్లీ : యుక్త వయసులో ఉన్న​ అమ్మాయిలను, అబ్బాయిలను భయపెట్టేది పరీక్షలు కాదు, సిలబస్‌ కాదు ...మరేంటంటే ‘ఆక్నే’ మన భాషలో చెప్పాలంటే మొటిమలు. అవును చంద్రబింబం లాంటి ముఖారవిందాన్ని పాడు చేయడానికి చిన్న మొటిమ చాలు. అందుకే మొటిమలంటే అంతలా భయపడతారు. మరి ఈ మొటిమలు ఎందుకు వస్తాయి, రాకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలో ఓ సారి చూద్దామా...

మొటిమలు అనేవి చర్మ సంబంధిత సమస్య. మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నూనే, చనిపోయిన చర్మ కణాలు చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల, ఒత్తిడి, హర్మోన్ల మార్పు, మోనోపాజ్‌ ఇలా రకరకాల కారణాలు. మారుతున్న జీవనశైలి కూడా మొటిమలు రావడానికి కారణం.

మొటిమలు రాకుండా ఉండాలంటే
రాత్రి పడుకునేముంది మేకప్‌ను పూర్తిగా తొలగించాలి
రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం వారు అయితే ఎక్కువ సార్లు శుభ్రంచేసుకోవాలి.
మేకప్‌ను తొలగించడానికి అల్కహాల్‌ రహిత మేకప్‌ రిమూవరన్‌ని ఉపయోగించాలి. తర్వాత డీప్‌ పూర్‌ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి.
ఆరోగ్యకరమైన, తాజా ఆహారాన్ని తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌, మసాలాలకు దూరంగా ఉండాలి.
వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. నీరు శరీరం నుంచి విషపదర్ధాలను బయటకు పంపిస్తుంది. దీని వల్ల చర్మం తాజాగా, తేమగా ఉంటుంది.
ప్రతిరోజు యోగా చేయ్యాలి. శ్వాస తీసుకోవడం, శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేయడం వల్ల శరీరమంతా మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా మొటిమలు రాకుండా ఉంటాయి.
ముఖాన్ని శుభ్రపర్చుకోవడానికి సబ్బు వాడకూడదు. సబ్బు వాడటం వల్ల ముఖం పొడిబారుతుంది. బాక్టీరియా వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది.
సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండటానికి సన్‌ స్క్రీన్‌ లోషన్‌ ఉపయోగించాలి.

వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మొటిమలు రాకుండా నివారించవచ్చు.

ఆకు కూరలు
ఆకుపచ్చ కూరలు బచ్చలి, పాలకూర వంటివి మీ రోజు వారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్‌ ఏ ఆంటీ ఏజింగ్‌ ఎజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థలో ఉన్న బాక్టీరియాను, విషపదర్ధాలను బయటకు పంపిస్తుంది.

పసుపు
మొటిమలను తగ్గించడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపుకు కూడా పసుపును వావడతారు. పసుపును ఆహారంలో తీసుకోవడం వల్ల మొటిమలను కలిగించే బాక్టీరియాను, విషపదర్ధాలను బయటకు నెట్టి వేస్తుంది.

క్యారేట్‌
క్యారేట్లలో విటమిన్‌ ఏ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రోజువారి ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి.

సాల్మన్‌
వీటిల్లో ఓమేగా3 ఫాటీ ఆమ్లాలు, ప్రోటీన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను నివారించడమే కాక నొప్పి, వాపుని తగ్గిస్తుంది.

మరిన్ని వార్తలు