గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య కేంద్రం

14 Aug, 2017 02:00 IST|Sakshi
గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య కేంద్రం

మృతుల సంఖ్యపై తప్పుడు కథనాలు: యోగి
గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌ ఆసుపత్రిలో చిన్నారుల మృతి ఘటనపై కేంద్రం ప్రభుత్వం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది. బీఆర్డీ ఆసుపత్రి ఘటనతో గోరఖ్‌పూర్‌లో ప్రాంతీయ వైద్య కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆదివారం బీఆర్డీ ఆసుపత్రిని సంద ర్శించిన కేంద్ర వైద్య మంత్రి జేపీ నడ్డా.. రూ. 85 కోట్లతో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు.

కేంద్రం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సాయం చేస్తామని నడ్డా వెల్లడించారు.  తూర్పు ఉత్తరప్రదేశ్‌లో దోమల ద్వారా వ్యాప్తి చెందు తున్న వ్యాధులపై యుద్ధం చేయాలంటే ప్రత్యేకమైన పరిశోధన కేంద్రం అవసరమని యోగి తెలిపారు. మృతిచెందిన చిన్నారుల సంఖ్య విషయంలో మీడియా తప్పుడు వార్తలను ప్రసారం చేసి ఆందోళన సృష్టించిందని యోగి మండిపడ్డారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

>
మరిన్ని వార్తలు