త్వరలో 1600మంది ఖైదీలకు విముక్తి

12 Jan, 2018 19:29 IST|Sakshi

ఎంజీఆర్‌, జయలలితల జయంతి సందర్భంగా..

సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎంజీ రామచంద్రన్, జయలలితల జయంతి సందర్భంగా తమిళనాడు జైళ్లలోని 1,600 మంది యావజ్జీవ ఖైదీలకు రాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించనున్నది. ఎంజీఆర్‌ జయంత్యుత్సవాలను ఈనెల 17వ తేదీన, వచ్చే నెల 25న జయలలిత జయంతిని నిర్వహించనున్నారు. ఈ సందర్భాలను పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో పదేళ్లకుపైగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అన్ని జైళ్లలోని జాబితాను కలుపుకుంటే 1,900 మంది ఖైదీల విడుదలకు జైళ్లశాఖ నుంచి సిఫార్సులు అందాయి. వీరిలో 1,600 మంది ఖైదీలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 

మరిన్ని వార్తలు