నిరుపేద‌ల కోసం ‘రిల‌య‌న్స్’ ముంద‌డుగు

20 Apr, 2020 14:41 IST|Sakshi

ముంబై :  సామాజిక సేవ‌లో ఎప్పుడూ ముందుండే నీతా అంబానీ మరో అడుగు ముందుకేసి మిష‌న్ అన్న సేవ పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ అన్న‌దాన కార్య‌క్ర‌మం చేప‌డుతున్నారు. క‌రోనా ఓడిపోతుంది..ఇండియా గెలుస్తుంది అనే నినాదంతో రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్ లిమిటెట్ కి చెందిన రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ ద్వారా పేద‌, వ‌ల‌స కూలీల‌కు అన్న‌దానం చేసే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టిన‌ట్లు రిలయన్స్ ఫౌండేషన్ సంస్థ వ్యవస్థాపకురాలు, ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ వెల్ల‌డించారు. భారత్‌లో లాక్‌డౌన్ గడువును పొడిగించడంతో  పేదలు, రోజువారీ కూలీల దయనీయ పరిస్థితులను చూసి చాలా బాధేసింద‌ని అన్నారు. అందుకే వారికి ఆహారం అందించేందుకు మిష‌న్ అన్న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టినట్లు ప్ర‌క‌టించారు. దీని ద్వారా 3 కోట్ల మంది నిరుపేద‌ల‌కు భోజ‌నం అందిస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌పంచంలోనే ఓ కార్పోరేట్ సంస్థ చేస్తున్న  అతి పెద్ద అన్నదాన పంపిణీ కార్య‌క్ర‌మం ఇదేన‌ని పేర్కొన్నారు.  క‌రోనాపై పోరులో త‌మ‌వంతు సాయంగా  అక్ష‌రాల 535కోట్ల రూపాయ‌ల  విరాళాన్ని అందించి దాతృత్వాన్ని చాటుకుంది రిల‌య‌న్స్ సంస్థ‌.


 

మరిన్ని వార్తలు