సీఎంకు, ఆమె తనయుడికి పెద్ద ఊరట

1 Feb, 2016 15:58 IST|Sakshi
సీఎంకు, ఆమె తనయుడికి పెద్ద ఊరట

జైపూర్: ధోల్‌పూర్ రాజసౌధం  వివాదంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కు ఊరట లభించింది. ఈ వివాదంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.   ధోల్‌పూర్ రాజసౌధం రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి అని దీనిపై    సీబీఐ విచారణ జరపించాలని  దాఖలైన  పిటిషన్పై విచారణకు ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో ధోల్పూర్, లలిత్ గేట్ వివాదంలో  చిక్కుకుని  ఉక్కిరిబిక్కిరి  అవుతున్న ముఖ్యమంత్రికి, ఆమె కుమారుడు దుష్యంత్ కు  పెద్ద  ఊరట లభించిట్టే.

కాగా  ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీతో కుమ్మక్కయి  దానిని భారీస్థాయి లగ్జరీ హోటల్‌గా మార్చారన్న కాంగ్రెస్ విమర్శించింది. ఆ సౌధం రాజస్తాన్ ప్రభుత్వ ఆస్తి అని రాజే మాజీ భర్త హేమంత్‌సింగ్ ఒక కోర్టులో అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్  ఆరోపించారు. అయితే దీన్ని   ఈ విమర్శలను తిప్పి కొట్టిన బీజేపీ  ధోల్ పూర్ ప్యాలెస్ వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఆస్తిగా స్పష్టం చేసింది.  ఆ ప్యాలెస్ కు చెందిన డాక్యుమెంట్లను, కోర్టు, కుటుంబ సంబంధిత సెటిల్ మెంట్ పేపర్లను బీజేపీ మీడియా ఎదుట ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు