బాబ్రీపై నివేదిక సాధారణం కాదు

28 Sep, 2019 03:38 IST|Sakshi

న్యూఢిల్లీ/లక్నో: రామజన్మ భూమి –బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి 2003లో భారత పురాతత్వ సర్వే (ఏఎస్‌ఐ) ఇచ్చిన నివేదిక సాధారణమైంది కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుపై వాదనలు 33వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సున్ని వక్ఫ్‌ బోర్డ్‌ తరఫున సీనియర్‌ లాయర్‌ మీనాక్షి అరోరా మాట్లాడుతూ.. ఏఎస్‌ఐ సర్వే కేవలం వారి అభిప్రాయమే అని, అది బలహీనమైందని అన్నారు. ఈ నివేదికను బలపరిచే ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం స్పందిస్తూ.. కోర్టు కమిషనర్‌ ఆధ్వ ర్యంలో ఆ నివేదిక రూపు దిద్దుకుం దని స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలాన్ని నిపుణులు క్షుణ్నంగా పరిశీలించి నివేదిక తయారు చేశారని తెలిపింది. 

కోర్టులో కల్యాణ్‌ సింగ్‌..
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కల్యాణ్‌ సింగ్‌  సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బీజేపీ నేతలను కోర్టు విచారిస్తోంది. కల్యాణ్‌ సింగ్‌ గతంలో రాజస్తాన్‌ గవర్నర్‌గా ఉండడంతో ఆయన విచారణను ఎదుర్కోలేదు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు