బీజేపీ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌

5 Mar, 2019 12:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ అధికారిక వెబ్‌సైట్‌ మంగళవారం హ్యాకింగ్‌కు గురైంది. పార్టీ వెబ్‌పేజ్‌ ఎర్రర్‌ 522 మెసేజ్‌ చూపడంతో గందరగోళం నెలకొంది. కాగా అంతకుముందు బీజేపీ వెబ్‌సైట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అభ్యంతరకర ఫోటోలు, భాషతో కూడిన వ్యాఖ్యలు కనిపించాయని కొందరు పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించి త్వరలో వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచుతామని అడ్మిన్‌ పేర్కొన్న సందేశం ఉంచారు. అయితే పార్టీ వెబ్‌సైట్‌ హ్యాకింగ్‌పై బీజేపీ ఇంతవరకూ అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బీజేపీ అధికారిక వెబ్‌సైట్‌ హ్యాక్‌ కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ఇటీవల పలు భారత ప్రభుత్వ వెబ్‌సైట్లను పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు హ్యాక్‌ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో బీజేపీ వెబ్‌సైట్‌ను యాక్సెస్‌ చేయగా ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్‌ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ల వీడియా అభ్యంతరకర పదజాలంతో కనిపించిందని హిందీ న్యూస్‌ వెబ్‌సైట్‌ అమర్‌ ఉజాలా పేర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే వెబ్‌సైట్‌ అందుబాటులో లేదని ఎర్రర్‌ మెసేజ్‌ చూపిందని ఆ వెబ్‌సైట్‌ తెలిపింది.

>
మరిన్ని వార్తలు