అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు: ఆరెస్సెస్‌

10 Sep, 2019 03:39 IST|Sakshi

పుష్కర్‌: సామాజిక, ఆర్థిక అసమానతలు ఉన్నాయి కనుకనే రిజర్వేషన్ల అవసరం ఉన్నదనీ, లబ్ధిదారులకు రిజర్వేషన్ల అవసరమున్నంత కాలం రిజర్వేషన్లు కొనసాగుతాయని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) స్పష్టం చేసింది. మంచినీటి విషయంలోనూ, శ్మశానాల్లోనూ, దేవాలయాల్లోనూ అందరికీ ప్రవేశం ఉండాలనీ, నీటి వనరుల వాడకాన్ని కులంపేరుతో నిరాకరించడం తగదనీ ఆర్‌ఎస్‌ఎస్‌ సంయుక్త ప్రధానకార్యదర్శి దత్తాత్రేయ హోసబేల్‌ తేల్చి చెప్పారు. సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలున్నాయనీ, అందుకే రిజర్వేషన్ల కొనసాగింపు అవసరమనీ ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తోం దన్నారు.  రాజస్తాన్‌లోని పుష్కర్‌లో మూడు రోజుల పాటు జరిగిన సంఘ్‌పరివార్‌ కోఆర్డినేషన్‌ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి 35 ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంఘాల నుంచి 200 మంది ప్రతిని«ధులతోపాటు బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జె.పి.నడ్డా, జనరల్‌ సెక్రటరీ బి.ఎల్‌.సంతోష్‌లు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు