దక్షిణాదిలో బయటపడిన అరుదైన లోహం

18 Feb, 2020 13:06 IST|Sakshi

బెంగళూర్‌ : భారత్‌లో ఎలక్ర్టిక్‌ వాహనాల తయారీకి భారీ ముందడుగు పడింది. ఎలక్ర్టిక్‌ బ్యాటరీల తయారీలో ఉపయోగించే కీలక లోహం లిథియం నిల్వలను బెంగళూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. అటామిక్‌ మినరల్స్‌ డైరెక్టరేట్‌కు చెందిన పరిశోధకులు దక్షిణ కర్ణాటక జిల్లాలోని కొద్దిపాటి భూమిలో 14,100 టన్నుల లిథియం నిల్వలను కనుగొన్నారని జర్నల్‌ కరెంట్‌ సైన్స్‌లో ప్రచురితమయ్యే పత్రాల్లో వెల్లడైంది. అందుబాటులో ఉన్న 30,300 టన్నుల ముడి లోహం నుంచి 14,100 టన్నుల లిథియం మెటల్‌ను తయారుచేయవచ్చని అంచనా వేస్తున్నామని బ్యాటరీ టెక్నాలజీస్‌లో ప్రావీణ్యం కలిగిన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ మునిచంద్రయ్య పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన వద్ద లిథియం నిల్వలు తక్కువేనని ఆయన అన్నారు. చిలీలో 8.6 మిలియన్‌ టన్నులు, ఆస్ర్టేలియాలో 2.8 మిలియన్‌ టన్నులు, అర్జెంటీనాలో 1.7 మిలియన్‌ టన్నుల లిథియం నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్‌ లిథియంను పూర్తిస్ధాయిలో దిగుమతి చేసుకుంటోంది.

చదవండి : స్కోడా తొలి ఇ-వాహనం ఎన్యాక్‌

మరిన్ని వార్తలు