ఛత్తీస్‌గ‌డ్‌లో మ‌రో మూడు నెల‌ల పాటు..

19 May, 2020 08:18 IST|Sakshi

రాయ్‌పూర్ :  దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌కు మ‌రిన్ని స‌డలింపులు ఇచ్చిన వేళ‌..ఛ‌త్తీస్‌గ‌డ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. మ‌రో మూడు నెల‌ల పాటు రాష్ర్ట‌వ్యాప్తంగా సీఆర్‌పీసీ సెక్ష‌న్ 144 కింద ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటుందని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం ఓ ప్ర‌క‌టన విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం..ఒకే ప్రాంతంలో న‌లుగురు లేదా అంత‌కంటే ఎక్కువ గుమిగూడ‌రాదు. రూల్ అతిక్ర‌మిస్తే జ‌రిమానా లేదా జైలు శిక్ష‌కు గురవుతారు. క‌రోనా ఇంకా అదుపులోకి రాలేద‌ని, ఈ నేప‌థ్యంలో ఆంక్ష‌లు స‌డ‌లిస్తే మ‌రింత ప్ర‌బ‌లే అవ‌కాశం ఉన్నందున రాష్ర్ట‌వ్యాప్తంగా త‌దుప‌రి ఆదేశాలు వ‌చ్చే వ‌ర‌కు 144 సెక్ష‌న్ అమల్లో ఉంటుంద‌ని తెలిపింది.

ఇప్ప‌టికే దీనికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఆయా జిల్లాల కలెక్ట‌ర్ల‌కు పంపిన‌ట్లు ప్రజా సంబంధాల శాఖ అధికారి తెలిపారు. అదే విధంగా  మే 31 వ‌ర‌కు రాష్ర్టంలో రెస్టారెంట్లు, హోట‌ళ్లు, బార్‌లు, స్టేడియంలకు అనుమ‌తి లేదు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక రాష్ర్టంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 92కాగా, ప్ర‌స్తుతం 33 యాక్టివ్ కేసులున్నాయి. ఇక లాక్‌డౌన్ 4.0 లో రెడ్, గ్రీన్, ఆరెంజ్ నోన్ల వారీగా కొన్ని కార్య‌క‌లాపాల‌కు కేంద్రం అనుమ‌తి ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. (8 కేటగిరీల వారికే కరోనా టెస్టులు )

మరిన్ని వార్తలు