ప్రాసలు, పంచ్‌లైన్లతో ఆకట్టుకున్న ప్రణబ్

10 Jun, 2014 00:53 IST|Sakshi

ప్రణబ్ ముఖర్జీ తన ప్రసంగంలో ట్రెడిషన్, టాలెంట్, టూరిజం, ట్రేడ్, టెక్నాలజీ; డెమొక్రసీ, డెమొగ్రఫీ, డిమాండ్... ఇలా ప్రాసయుక్త పదాలు వాడి రంజింపజేశారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’, ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ (అందరితో, అందరి అభివద్ధి)’, హర్ హాత్ కో హునర్, హర్ ఖస్త్రత్ కో పానీ (ప్రతి చేతికీ నైపుణ్యం, ప్రతి పొలానికీ నీరు)’, ‘పెర్ డ్రాప్, మోర్ క్రాప్ (ప్రతి చుక్క నీటికీ మరింత పంట)’ వంటి ప్రణబ్ హిందీ, ఇంగ్లిష్ నినాదాల నిండా మోడీ ముద్ర స్పష్టంగాా కన్పించిం ది. రూరల్-అర్బన్ (గ్రామీణ-పట్టణ) విభేదాలను తుడిచేస్తామంటూ ప్రణబ్ ప్రతినబూనారు. ఆ రెండింటి కలయికగా ‘రుర్బన్’ అనే భావనను తెరపైకి తెచ్చి ఆకట్టుకున్నారు.
 
 

మరిన్ని వార్తలు