గోప్యత కంటే జాతీయ భద్రతే ముఖ్యం: రిజిజు

1 Sep, 2017 01:30 IST|Sakshi

న్యూఢిల్లీ : వ్యక్తిగత గోప్యత వంటి అంశాలతో పోల్చుకున్నప్పుడు జాతీయ భద్రత, దేశ ప్రయోజనాలు అత్యంత ప్రధానమైనవని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. సైబర్‌ భద్రతపై అసోచామ్‌ గురువారం నాడిక్కడ నిర్వహించిన సదస్సులో రిజిజు మాట్లాడారు. ‘నేనిక్కడ గోప్యతపై సుప్రీం తీర్పును విమర్శించడం లేదు.

దేశంలో చట్టాలు రూపొందించడానికి సర్వాధికారాలను ప్రజలు పార్లమెంటుకు కట్టబెట్టారు. ప్రాథమిక హక్కుల్లో భాగమైన గోప్యత హక్కును సమీక్షించే ఆలోచన కేంద్రానికి లేదు. కానీ నా వ్యక్తిగత అభిప్రాయంలో దేశ భద్రత, ప్రయోజనాలు వ్యక్తిగత గోప్యతతో పోల్చుకున్నప్పుడు అత్యంత ప్రధానమైనవి’ అని రిజిజు తెలిపారు. గోప్యత హక్కు ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని ఆగస్టు 24న సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు