డైలమాలో ఆర్జేడీ

2 Jun, 2015 17:29 IST|Sakshi
డైలమాలో ఆర్జేడీ

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. జనతాదళ్ యునైటెడ్(జేడీ-యూ)తో పొత్తుకైనా, విలీనానికైనా సిద్ధంగా ఉన్నామని ఆర్జీడీ అధినేత లాలా ప్రసాద్ యాదవ్ సోమవారం ఒకమెట్టు దిగివచ్చినా..  జేడీయూను కాంగ్రెస్, ఎన్సీపీలు వెనకేసుకురావడం ఆయనకు అంతగా రుచించడంలేదు.  బీహార్ లో బీజేపీని ఎలాగైనా కంగుతినిపించాలని భావిస్తున్న కాంగ్రెస్, ఎన్సీపీలు నితీష్ కుమార్ సీఎం అభ్యర్థితానికి మొగ్గు చూపుతున్నాయి. కాంగ్రెస్-ఎన్సీపీలు సహకారమే నితీష్ కు ఎక్కువగా కలిసొచ్చే అవకాశముందని తాజాగా  ఎన్సీపీ నేత తారీఖ్ అన్వర్ స్పష్టం చేసి పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెప్పారు.

ఇదిలా ఉండగా జేడీయూతో పొత్తు పెట్టుకుంటున్నట్లు కాంగ్రెస్ బహిరంగ ప్రకటనపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు కూడా సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ తో తమకు మంచి సంబంధాలున్నట్లు నితీష్ ఇప్పటికే స్పష్టం చేయడంతో వారి పొత్తు దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది. దీంతో జేడీయూతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న లాలూ మాత్రం తీవ్ర డైలామాలో పడ్డారు. ఒకవేళ జేడీయూ పొత్తు కుదరకపోతే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లి నెగ్గుకు రావాల్సిన పరిస్థితి.  ఈ నేపథ్యంలో తన తదుపరి కార్యచరణపై లాలూ తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు. 

మరిన్ని వార్తలు