సరిహద్దు రక్షణ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తాం

8 Dec, 2017 03:45 IST|Sakshi

కోల్‌కతా: రోహింగ్యాలు సహా దేశంలోకి వచ్చే అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి భారత్‌–బంగ్లాదేశ్‌ల మధ్య త్వరలోనే ఏకీకృత కమాండ్‌ నేతృత్వంలో ‘సరిహద్దు రక్షణ గ్రిడ్‌’ను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. సరిహద్దు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంమంత్రులతో రాజ్‌నాథ్‌ గురువారం నాడిక్కడ భేటీ అయ్యారు. కంచెలు, నిఘా వ్యవస్థ, ఇంటెలిజెన్స్‌ సంస్థలు, రాష్ట్ర పోలీసులు, బీఎస్‌ఎఫ్, ఇతర కేంద్ర, రాష్ట్ర బలగాలతో 4,036 కి.మీ మేర ‘సరిహద్దు రక్షణ గ్రిడ్‌’ను ఏర్పాటు చేస్తామన్నారు. ఏకీకృత కమాండ్‌లో ఆర్మీ, పారామిలటరీ బలగాలు, రాష్ట్ర పోలీసులు భాగస్వాములుగా ఉంటారన్నారు.  

మరిన్ని వార్తలు