రోహిత్ మృతిపై ద్విసభ్య కమిటీ ఏర్పాటు

18 Jan, 2016 15:09 IST|Sakshi

న్యూఢిల్లీ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి రోహిత్ మృతిపై కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ...ఇద్దరు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులు షకీలా శంషూ, సురత్ సింగ్ లు సోమవారం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. హెచ్సీయూలో ఏం జరిగిందన్న అంశంపై కమిటీ సభ్యులు విచారణ జరిపి రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. మరోవైపు రోహిత్ భౌతికకాయానికి ఉస్మానియాలో పోస్ట్ మార్టం పూర్తయింది. అనంతరం ఉప్పల్లోని అతని స్వగృహానికి తరలించారు.

కాగా రోహిత్ కేసులో వీసీ అప్పారావును బర్తరఫ్ చేయాలని, రోహిత్ మృతికి కారణమైన దత్తాత్రేయపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత, అధ్యాపక సంఘాలు సోమవారం విశాఖ త్రి టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి.

>
మరిన్ని వార్తలు