ఆ మూడు పరోఠాలు తింటే మొనగాళ్లే

14 Nov, 2017 10:49 IST|Sakshi

రోహ్‌తక్‌ : అది ఢిల్లీ-రోహ్‌తక్‌ బైపాస్‌ రోడ్డు. అక్కడ ఓ బిజీ పఠోఠా సెంటర్‌ దర్శనిమిస్తుంది. ఆ హోటల్‌ యాజమాని బోర్డు మీదే ఓ బంఫరాఫర్‌ ఇస్తున్నట్లు ప్రకటన ఇవ్వటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆయన చేసే ఛాలెంజ్‌లో మీరు గెలిస్తే చాలూ 5100 రూపాయల నజరానాతోపాటు.. జీవితాంతం అక్కడ ఫుడ్ ఫ్రీగా దొరుకుతుంది. అయితే బరిలోకి దిగే ముందు మీరు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. 

ఇవి ఆషామాషీ పరోఠాలు కావు.  ఏదో మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లు అరచేతిలో పట్టే సైజుతో ఉండవు. ఆ ఒక్కో పరోఠా బరువు సుమారు కేజీ దాకా ఉంటుంది. పరిమాణం 1 అడుగు పొడవు, 6 అంగుళాల మందం ఉంటుంది. ఒకవేళ వాళ్లు ఓడిపోతే ఆ మూడు పరోఠాల ఖర్చుకు అయ్యే సొమ్మును కక్కాల్సి ఉంటుంది. ఇలాంటి మూడు పరోఠాలను మూడు కేజీల పిండితో తయారు చేస్తారు. ఎంతో మంది ముందుకు వచ్చిన ఈ భారీ పరోఠాలను 50 నిమిషాల్లో తినడం తమ వల్ల కాదంటూ తులెత్తేస్తారంట.  

ఈ ప్రకటన చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సవాల్‌లో ఎవరూ గెలుపు సాధించలేకపోయారని హోటల్ యజమాని చెబుతున్నారు.  హిందుస్థాన్‌ కా సబ్‌ సే బడా పరోఠా అని బోర్డు మీద వాటి ఫోటోలు చూశాక కూడా మీరు ఛాలెంజ్‌ను స్వీకరించి గెలిస్తే మాత్రం మీరు నిజంగా మొనగాళ్లేనని ఆయన అంటున్నారు. 

మరిన్ని వార్తలు