ఫిరోజ్‌ఖాన్‌.. ద హీరో! 

29 Apr, 2018 23:01 IST|Sakshi
ఆర్పీఎఫ్‌

సాహస అవార్డును ఇవ్వాలని ఈస్ట్‌కోస్‌ రైల్వే సిఫారసు 

భువనేశ్వర్‌ : ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వందలాది మంది ప్రాణాలను కాపాడడంతోపాటు ఎటువంటి ఆస్తినష్టం జరగకుండా అత్యంత ధైర్యసాహసాలను ప్రదర్శించిన రైల్వే కానిస్టేబుల్‌ ఫిరోజ్‌ఖాన్‌ను ‘సాహస పురస్కారం’తో సత్కరించాలని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే సిఫారసు చేసింది. ఆర్పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న 45 ఏళ్ల ఫిరోజ్‌ ఖాన్‌.. ఏప్రిల్‌ 27 ఉదయం అలెపీ–ధన్‌బాద్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒడిశాలోని జహర్సగూడా రోడ్‌స్టేషన్‌  చేరుకోగానే  ఎస్‌–3 కోచ్‌లో కేకలు, అరుపులు వినిపించాయి. వెంటనే ఖాన్‌ కోచ్‌లోకి వెళ్లి చూడగా ఒక బెర్త్‌ కింద ఒక  మండుతున్న పాలిథిన్‌ బ్యాగ్‌ కనిపించింది.

వెంటనే దానిని తీసుకుని ఫ్లాట్‌ ఫాంకు దూరంగా పరుగెత్తాడు. అక్కడకు చేరుకున్న బాంబ్‌ స్వా్కడ్‌ పాలిథిన్‌ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో ఆరు రకాల పేలుడు పరికరాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని నిర్వీర్యం చేయడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంతటి క్లిష్టపరిస్థితుల్లో సైతం సమయస్ఫూర్తితో,  ధైర్యంగా వ్యవహరించిన తీరుకు ఫిరోజ్‌ ఖాన్‌కు గ్యాలంటరీ అవార్డు ఇచ్చి సత్కరించాలని కోరుతూ ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు.  

మరిన్ని వార్తలు