దుస్తుల్లో రూ.1.36 కోట్లు తరలింపు

26 Mar, 2019 04:00 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: దుస్తుల్లో దాచి రహస్యంగా రూ. 1.36 కోట్లు తీసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులను చెన్నై ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు సోమవారం అరెస్ట్‌ చేశారు. చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని వాల్‌టాక్స్‌ రోడ్‌లో సోమవారం ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురిని అధికారులు చూశారు. వారిని దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ప్రశ్నించారు. తనిఖీ చేయగా వారు ధరించిన దుస్తుల నుంచి కట్టలు కట్టలుగా రూ. 1.36 కోట్ల నగదు బయటపడింది. వీరిని విజయవాడకు చెందిన బాషా, శ్రీనివాసులు, ఆంజనేయులు, షేక్‌ సలీంగా గుర్తించారు.  నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో ఎన్నికల్లో పంచేందుకు తరలిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

మరిన్ని వార్తలు