ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350కోట్లు

2 Aug, 2017 01:12 IST|Sakshi
ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350కోట్లు

వరద సాయాన్ని ప్రకటించిన ప్రధాని మోదీ

గువాహటి: ఈశాన్య రాష్ట్రాలకు వరద సాయంగా రూ.2,350 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందులో అసోం రాష్ట్రానికి తక్షణసాయంగా రూ. 250 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ ఏడాది జూన్‌లోనే కేంద్రం రూ. 300 కోట్లను ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా విడుదల చేసినట్లు అసోం ఆర్థికమంత్రి హిమంతబిశ్వా శర్మ, జలవనరుల మంత్రి కేశబ్‌ మహంత మంగళవారం విలేకరులకు తెలిపారు. అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, అసోం రాష్ట్రాల్లోని వరదలపై తాజా పరిస్థితిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమీక్షించారు.

సమావేశం అనంతరం మంత్రి కేశబ్‌ మహంత మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో సుమారు ఐదు గంటలపాటు జరిగిన సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల్లోని సమస్యలపై ప్రత్యేక దృష్టిని పెడుతున్నట్లు మోదీ చెప్పారన్నారు. వరద ముంపును ఎదుర్కొనేందుకు స్వల్ప, దీర్ఘ కాలిక ప్రణా ళికలను అమలు చేయాలని.. ఈ అంశంలో ఈశాన్య రాష్ట్రాలకు సంపూర్ణ సహకారం అందజేస్తామని మోదీ చెప్పారన్నారు.

మరిన్ని వార్తలు