రూ. 500 కోట్ల విలువైన విగ్రహాలు స్వాధీనం

30 Nov, 2016 00:35 IST|Sakshi

తండ్రీకొడుకుల అరెస్ట్

 సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని ఆలయాల నుంచి రూ. 500 కోట్ల విలువైన విగ్రహాలను దొంగలించిన  కేసులో నిందితులైన వల్లభ ప్రకాశ్, ఆదిత్య ప్రకాశ్ అనే తండ్రీకొడుకులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని పురాతన ఆలయాల్లోని విగ్రహాలు చోరీకి గురవుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదు లు అందుతున్నారుు. 50 ఏళ్లలో తమిళనాడుకు చెందిన సుమారు వెయ్యికిపైగా విలువైన విగ్రహాలు విదేశాలకు తరలిపోయినట్లు తెలుసు కున్నారు.

ఈ నేపథ్యంలో చోరీ నిరోధక ఐజీ పొన్ మాణిక్యం విగ్రహా ల అన్వేషణలో భాగంగా ముంబైకి చేరుకుని అక్కడి ఇండో-నేపాల్ ఆర్ట్ సెంటర్‌కు వెళ్లారు. అక్కడ ప్రదర్శి తమై ఉన్న కొన్ని విగ్రహాలు తమిళనాడుకు చెందినవిగా గుర్తించారు. ప్రత్యేక దళాలను రప్పించి మంగళవారం ఆర్ట్ సెంటర్‌ను ముట్టడించారు. నిర్వాహకులు వల్లభ ప్రకాశ్, ఆదిత్య ప్రకా్‌శ్‌లను అరెస్ట్ చేశారు. ఈ ఆర్ట్ సెంటర్ నుంచి స్వాధీనం చేసుకున్న విగ్రహాల విలువ ప్రపంచ మార్కెట్‌లో రూ.500 కోట్లని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు