'ఎనిమిదిన్నర లక్షల కోట్లు ఖర్చు చేస్తాం'

13 Jan, 2016 18:25 IST|Sakshi

అగర్తల: రానున్న ఐదేళ్లలో మొత్తం భారతీయ రైల్వే వ్యవస్థనే సమూలంగా మార్చి వేస్తామని కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా అన్నారు. భారతీయ రైల్వేపై ఐదేళ్లలో రూ.8.5లక్షల కోట్లు ఖర్చుచేస్తామని ఆయన తెలిపారు. బుధవారం అసోం-అగర్తల మధ్య కొత్తగా నిర్మించిన బ్రాడ్ గేజ్ ట్రయల్ రైలును ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత అవసరమైన అన్ని అనుమతులు తీసుకొని అధికారికంగా ఈ మార్గంలో రైలు సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. బంగ్లా సరిహద్దును పంచుకునే త్రిపుర రైలు మార్గాన్ని ప్రారంభించి త్వరలోనే డిసెంబర్ 2017నాటికి పూర్తి చేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు