ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌పై విమర్శల వెల్లువ

25 Feb, 2015 03:26 IST|Sakshi

న్యూఢిల్లీ: మదర్ థెరిసా మతమార్పిడి కోసమే పేదలకు సేవ చేశారన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలపై మంగళవారం పలు క్రైస్తవ సంస్థలు, బీజేపీయేతర పార్టీలు నిప్పులు చెరిగాయి. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ కూడా దద్దరిల్లింది. జీవితాన్ని పేదల సేవకే అంకితం చేసిన థెరిసాపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని కోల్‌కతా మిషనరీస్ ఆఫ్ చారిటీ, జాతీయ మైనారిటీల కమిషన్, తిరువనంతపురం కేథలిక్ చర్చి అధికారులు మండిపడ్డారు.

భాగవత్ వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లోక్‌సభలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని విపక్ష సభ్యులు లేవనె త్తగా స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు నిరాకరించారు. థెరిసా పేదల ఆశాజ్యోతి అని వాటికన్ పేర్కొంది.

మరిన్ని వార్తలు