హస్తినలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌..

9 Nov, 2019 08:36 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్య కేసులో సుప్రీం కోర్టు చారిత్రక తీర్పు వెల్లడించనున్న క్రమంలో ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఢిల్లీ చేరుకున్నారు. తీర్పు నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌ షా సహా పలువురు బీజేపీ నేతలతో మంతనాలు జరపనున్నారు. మరోవైపు శనివారం ఉదయం బీజేపీ కార్యాలయానికి చేరుకుని పార్టీ నేతలతో అయోధ్య కేసులో సుప్రీం తీర్పు తదనంతర పరిణామాలపై అమిత్‌ షా సమాలోచనలు జరుపుతారు. పార్టీ వ్యూహంపై అమిత్‌ షా, ఆరెస్సెస్‌ చీఫ్‌ నేటి సాయంత్రం మీడియా ముందుకు రానున్నట్టు సమాచారం. ఇక దశాబ్ధాల తరబడి రామజన్మభూమి-బాబ్రీమసీదు భూమి వివాదం కేసుపై సుప్రీం కోర్టు శనివారం ఉదయం 10.30 గంటలకు చారిత్రక తీర్పును వెలువరించనుంది. తీర్పుపై ప్రజలంతా సంయమనం పాటించాలని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ విజ్ఞప్తి చేశారు.

>
మరిన్ని వార్తలు